మంచేరియల్, 20 September
సేవ భారతి ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి 5/10 రన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 1200 మందికి పైగా యువతీ యువకులు, మహిళలు, వాకర్స్, రన్నర్స్, డాక్టర్లు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఈ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు.
సేవ భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి నిర్వహించిన 5/10 రన్ ను సేవ భారతి రాష్ట్ర సభ్యులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1200 పైగా యువతీ యువకులు, మహిళలు, వాకర్స్, రన్నర్స్, డాక్టర్లు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, ఫిట్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం ఫిట్నెస్ సాధన చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ రన్ లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ఫిట్ లో భాగస్వామ్యులై నిత్యం ఫిట్నెస్ పై దృష్టి సారించాలని రఘునాథ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏకాలవ్య ఆశ్రమం అధ్యక్షులు ఓడ్నాల లక్ష్మి నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, కస్తూరి నాగరాజు, బోట్ల సత్యం, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, సత్రం రమేష్, కుర్రె చక్రవర్తి, బియ్యాల సతీష్ రావు, డేగ బాపు, ఆకుల అశోక్ వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ స్వప్న రాణి, బింగి ప్రవీణ్, నాంపల్లి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.











