భగవాన్ విశ్వకర్మ జయంతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అధికారులు పాల్గొన్నారు. ఈ , విశ్వ కర్మ కార్పోరేషన్ కు పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కస్తూరి శ్రీనాథ్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్, డి.సి.పి తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కస్తూరి శ్రీనాథ్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ చారి, రాష్ట్ర కార్యదర్శి పెద్దపల్లి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నూతి తిరుపతి మాట్లాడుతూ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అభ్యర్థన మేరకు 2022 సంవత్సరం నుంచి విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అయితే, విశ్వ కర్మ కార్పోరేషన్ కు పాలక మండలిని ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని వారు ఆరోపించారు. వెంటనే కార్పోరేషన్ కు పాలక మండలిని ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వకర్మ ఆశయాలను స్మరించుకుంటూ, సంఘం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.










