లక్షెట్టిపేట (ప్రజావార్త) సెప్టెంబర్ 13
మండలం పోతపల్లి గ్రామానికి చెందిన ఏనుగందుల శేఖర్ అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు వెంటనే స్పందించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
పోతపల్లిలో శేఖర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల అండ: మంతెన జగన్ మోహన్ రావు ఆర్థిక సాయం (పోతపల్లి): లక్షేట్టిపేట్ మండలం పోతపల్లి గ్రామానికి చెందిన ఏనుగందుల శేఖర్ అనారోగ్యంతో అకాల మరణం చెందడం స్థానికంగా తీవ్ర సంతాపాన్ని నింపింది. విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు గారు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శేఖర్ భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతు మానవతా సాయంగా రూ. 5,000/- నగదుతో పాటు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శేఖర్ అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, "మేమున్నామంటూ" కొండంత భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ లక్ష్మి, ఉప సర్పంచ్ మల్లేష్, మాజీ ఎంపీపీ అన్నం చిన్నన్న, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, నాయకులు బోడ రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు నారాయణ, అమీర్, ఆసటి సుధాకర్, చిట్టిమల్ల దిలీప్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.










