మంచేరియల్, 20 September
టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద ఆదివారం 6వ రోజు మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బొమ్మ సుప్రియ రాజేశ్వర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా సన్మానించారు.
టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద ఆదివారం 6వ రోజు మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బొమ్మ సుప్రియ రాజేశ్వర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 6వ రోజు మహా అన్నదానం చేసిన బొమ్మ సుప్రియ రాజేశ్వర్ రెడ్డి దంపతులకు శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలిలో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజూ మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మహా అన్నదానం చేసిన బొమ్మ సుప్రియ రాజేశ్వర్ రెడ్డి దంపతులకు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ తరపున ఘనంగా సన్మానం చేశారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, సైడ్ల మొండయ్య, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, తిరుపతి రెడ్డి సునీత, ఎన్. సత్యనారాయణ, టి.తిరుపతి, రాంకుమార్, ప్రసాద్, ఉషన్న, టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.











