గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జెట్టి నవీన్ కుమార్‌ను, ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జి, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, సింగరేణి సంస్థలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌ను ఓసీపీ-05 గని వద్ద అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జెట్టి నవీన్ కుమార్‌ను, ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జి, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, సింగరేణి సంస్థలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌ను ఓసీపీ-05 గని వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జెట్టి నవీన్ కుమార్ (38), తండ్రి కొమురయ్య, ముదిరాజ్ కులం, సుల్తానాబాద్ మండలం, గారెపల్లి గ్రామం, జీపీ రావు కాలనీ, ఇంటి నం. 7-57/1 నివాసి. ఇతను సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల, సీసీసీ నస్పూర్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. రెండవ నిందితుడు బొమ్మకంటి రవికుమార్ (35), తండ్రి సత్తయ్య, బీసీ-బి (పద్మశాలి) కులం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి, బుద్ధ ఖుర్ద్, ఇంటి నం. 3-2 నివాసి. ఇతను ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 2 2 ఇన్‌క్లైన్ గనిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు, నిందితులకు చెందిన రెండు సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి.
గత శనివారం, 12-09-2026న గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ డేటా, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించారు. వీటి ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి కేసును ఛేదించారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్‌కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాల కారణంగా నవీన్ కుమార్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కళాశాలకు వచ్చే క్రమంలో యువతితో అతనికి పరిచయం ఏర్పడి, అనంతరం అది సన్నిహిత సంబంధంగా మారింది. ఈ సంబంధాన్ని వివాహం వరకు తీసుకెళ్లాలని నవీన్ కుమార్ భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యువతి డిప్లొమా పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో, శిక్షణ నిమిత్తం గోదావరిఖనికి వచ్చింది. ఈ సమయంలో ఆమెకు బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. యువతి నవీన్ కుమార్‌కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేకపోయాడు. దీంతో యువతిపై అతనికి తీవ్ర ఆగ్రహం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, యువతిని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న నవీన్ కుమార్, 12-09-2026న ముందస్తు ప్రణాళికతో పురుగుల మందును ఒక నీటి సీసాలో నింపుకుని తన ఎకోస్పోర్ట్ కారులో ఉంచుకున్నాడు. అదేరోజు సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వెళ్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. రవికుమార్ తనపై అత్యాచారం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ ఒక సూసైడ్ నోట్ రాయించాడు. ఆ నోట్‌ను ఆమె ఫోన్‌తో ఫొటో తీసిన అనంతరం, ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగుల మందును యువతికి బలవంతంగా తాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పురుగుల మందు తీసుకోవడంతో యువతి కారులోనే స్పృహ కోల్పోయింది.












