పెద్దపల్లి, 2026-06-05
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని గంగారం, ఉషన్నపల్లి గ్రామాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు.
పాఠశాల భవనం, సీసీ రోడ్ల ప్రారంభం
ఉషన్నపల్లి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 32 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
విద్యార్థుల సంఖ్య పెంపునకు పిలుపు
ఒకప్పుడు సరైన భవనం లేక, కేవలం 20 మంది విద్యార్థులతో ఉన్న ఉషన్నపల్లి పాఠశాల, నేడు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల కృషితో 56 మంది విద్యార్థులతో కళకళలాడుతుండటం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 75కి పెంచాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు హెడ్మాస్టర్ సమ్మయ్య, మండల విద్యాధికారి, గ్రామ సర్పంచ్ చొరవతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ వాడకం పోను మిగిలిన డబ్బులు నేరుగా పాఠశాల ఖాతాలోనే జమ అవుతాయని తెలిపారు.
నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి నిధుల కేటాయింపు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు నియోజకవర్గంలో విద్యా రంగానికి ఇప్పటివరకు 50 కోట్ల పైచిలుకు ఖర్చు చేశామని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత 10 ఏళ్లలో స్కూల్ భవనాలకు కోటి రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కానీ తమ ప్రభుత్వం రెండేళ్లన్నర కాలంలోనే కాల్వ శ్రీరాంపూర్ మండలంలో స్కూల్ భవనాలు, కాంపౌండ్ వాల్స్ కోసం 5 నుండి 6 కోట్లు, కస్తూరిబా పాఠశాల () విస్తరణకు 2.5 కోట్లు మంజూరు చేశామని వివరించారు.
మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం
ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం (టిఫిన్) అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
రోడ్ల నిర్మాణానికి హామీ
గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గంగారం టర్నింగ్ మెయిన్ రోడ్డు నుండి ఉషన్నపల్లి గ్రామం నుంచి పందిళ్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే శ్రీరాంపూర్ రోడ్డు నుండి ఉషన్నపల్లి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేసి పనులు పూర్తి చేస్తామన్నారు.












