హైదరాబాద్, 4 August
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, రచయిత శ్రీ నిషిదర్ రెడ్డి గారు తమ రచన పుస్తకాన్ని ఆయనకు బహుకరించారు.
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, రచయిత శ్రీ నిషిదర్ రెడ్డి గారు తమ రచన "From India to Australia" పుస్తకాన్ని ఆయనకు బహుకరించారు.
అంతర్జాతీయ విద్యా రంగంలో తన ప్రయాణం, అనుభవాలు, భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రితో పంచుకోవడం తనకు గర్వకారణమని రచయిత తెలిపారు. విలువైన సమయాన్ని కేటాయించి పుస్తకాన్ని స్వీకరించి, అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద పలువురి ప్రాణాలను కాపాడి విశేష గుర్తింపు పొందిన బాండీ బీచ్ హీరో శ్రీ రెహ్మత్ పాషా గారు కూడా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీ రెహ్మత్ పాషా గారిని ప్రత్యేకంగా అభినందించి, ఆయన చేసిన సేవలను కొనియాడారు. దీంతో ఈ సమావేశం మరింత విశిష్టంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో శ్రీ దేవేందర్ రెడ్డి గారు, శ్రీ వేణు చింతపట్ల గారు కూడా పాల్గొన్నారు.










