Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 29
జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్ కు వెళ్లే మార్గంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో విద్యార్థినులు, సిబ్బంది, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పాములు, విషసర్పాల సంచారం కారణంగా ప్రమాద భయం నెలకొందని తెలిపారు.
జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్కు హైవే నుంచి వెళ్లే సీసీ రోడ్డుపై స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో ఆ ప్రాంతంలో పాములు, ఇతర విషసర్పాలు సంచరించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రమాద భయం నెలకొన్నట్లు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జైపూర్ ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులతో సమన్వయం చేసి హైవే నుంచి కస్తూర్బా హాస్టల్ వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న సమస్యగా కనిపించినా, ప్రతి రోజు వందలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో వెలుతురు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జి. వెంకటేష్, బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు ఆర్. మల్లేష్, బీఆర్ఎస్ మిట్టపల్లి నాయకుడు పాల్గొన్నారు.












