మంచేరియల్, జూలై 12, 2026
యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2026 ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి గడువులో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను సందర్శించి ఆయన పలు సూచనలు చేశారు.
యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2026 ప్రవేశ పరీక్షలను పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షా గదులు, హాజరు నమోదు, ప్రశ్నాపత్రాల పంపిణీ, ఇన్విజిలేషన్ విధానం తదితర అంశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రతతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అభ్యర్థులకు ప్రశాంతమైన పరీక్షా వాతావరణం కల్పించాలని తెలిపారు.
అనంతరం తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల పారదర్శకతను కాపాడుతూ అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
తాండూరు గ్రామపంచాయతీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించారు. మండల పంచాయతీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శితో కలిసి తక్కువ పురోగతి నమోదు చేసిన బూత్ స్థాయి అధికారులతో సమావేశమై పెండింగ్లో ఉన్న ఫారాలను ప్రాధాన్యతతో పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా వివరాలు డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, గంగారం గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మండల తహసిల్దార్, ఉపతహసిల్దార్, మండల పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లతో కలిసి పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.












