మంచేరియల్, 2026-07-10
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు.
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సూచించారు.
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఆయన స్కూల్ కిట్లు (బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్) పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉన్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ప్రణాళికతో ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, జోగుల శ్రీదేవి, ఆకుల అశోక్ వర్ధన్, అమిరిశెట్టి రాజ్ కుమార్, బింగి ప్రవీణ్, మెరెడిగొండ శ్రీనివాస్, బింగి సత్యనారాయణ, బుద్దారపు రాజమౌళి, ముల్కాల్ల కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.











