మంచేరియల్, జూలై 8, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) & జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) & జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించాలని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉంటూ తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తరగతి గదిలో విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా బోధన సాగించాలని సూచించారు. విద్యార్థులు కొత్త విషయాలు, ఆవిష్కరణలు, పరిశోధనల పట్ల ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో-ఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, సెక్టోరియల్ అధికారులు భరత్ కుమార్, కృష్ణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు బండి రమేష్, రిసోర్స్ పర్సన్స్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలంలోని బుద్ధకాలన్ గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాలను పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో ఘన, ద్రవ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు గ్రామపంచాయతీలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి, వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎన్.కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేందర్, పంచాయతీరాజ్ డి.ఈ.ఈ. రవీందర్, గ్రామ సర్పంచ్ దాడి నాగేశ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భీమిని మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. భావితరాలకు సహజ సిద్ధమైన సమతుల్య వాతావరణాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. అనంతరం వడల, జగ్గయ్యపేట గ్రామాలలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేస్లాపూర్ గ్రామపంచాయతీలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం, అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీఎస్ కేస్లాపూర్–గట్టుపల్లి పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి చదువు, అభ్యాసం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.












