పెద్దపల్లి, జులై 12
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో డ్రగ్స్ వినియోగం, నిషేధంపై అవగాహన కార్యక్రమం జరిగింది. స్కౌట్ మాస్టర్ రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులను, యువతను డ్రగ్స్ ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరించారు. స్నేహితుల ఒత్తిడి, క్షణికావేశం వంటి కారణాలతో యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి జీవితాలను నాశనం చేస్తుందని స్కౌట్ మాస్టర్ రాజమౌళి తెలిపారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ రాజమౌళి ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం, నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కౌట్ మాస్టర్ రాజమౌళి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను, యువతను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలలో డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకోవడం ఒకటి అని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు స్నేహితుల ఒత్తిడి, తప్పుడు ప్రచారం లేదా క్షణిక ఆనందం కోసం డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారని, అవి నెమ్మదిగా జీవితాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన అన్నారు.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెదడు, ఆరోగ్యం దెబ్బతింటుందని, మెదడు సరిగా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చదువుపై దృష్టి నిలవకపోవడం వంటి పరిణామాలు ఉంటాయని ఆయన వివరించారు. ఏకాగ్రత కోల్పోయి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలు దెబ్బతింటాయని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు రాములు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు రేణుక, రాజేశం, స్కౌట్ మాస్టర్ రాజమౌళి, రజిత, పరమేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.












