క్యాతన్ పల్లి పురపాలికలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించింది. పాఠశాల అభివృద్ధికి ట్రస్ట్ అధ్యక్షుడు సుంకరి మల్లేష్, సభ్యులు కలిసి రూ.10,000 విరాళంగా ఇచ్చారు.
జిల్లా పరిషత్ (బాలుర) పాఠశాలలో గత సంవత్సరం 56 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 128కి చేరిందని, వీరితో పాటు 17 మంది బాలికలు కూడా చేరినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అవసరమని, దీనికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు.
ప్రధానోపాధ్యాయుడి అభ్యర్థనకు స్పందించిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ మాట్లాడుతూ, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి విద్యాసంస్థలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటేబుల్ ట్రస్టు అధ్యక్షుడు సుంకరి మల్లేష్, గౌరవ అధ్యక్షుడు బీనవేన సంపత్, సభ్యులు అల్లం కుమార్, కలవల సంపత్, అడిచర్ల శరత్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు.












