లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మన హౌసింగ్ కాలనీలో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కాలనీ మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరారు. గౌరమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీ మహిళలకు, సభ్యులకు అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు నడిమెట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సునీత మరియు సభ్యులు, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.











