
తెలంగాణ ప్రభుత్వం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ కర్రు శంకర్ సోదరుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు వారి నివాసానికి వెళ్లి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఇతర ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి మట్టం, ఇన్ ఫ్లో-అవుట్ లో పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సందర్శించారు. గోదావరి వరద ఉధృతిని పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికల హామీని నెరవేరుస్తూ, వీర్లపల్లి గ్రామ ప్రజలకు త్వరలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ప్రభావంతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా శ్రీ శ్రీపతి బాపూరావు సార్ గారు శుక్రవారం (01.08.2026) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, ఓ టాటా సుమో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2.15 లక్షల విలువైన మద్యం పట్టుబడగా, వాహన డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహారాష్ట్ర నుంచి అక్రమంగా గడ్డి మందులను తరలించి, మంచిర్యాల జిల్లాలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను భీమిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.44 లక్షల విలువైన మందులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ వివరాలు వెల్లడించారు.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ ఎక్స్ రోడ్ వద్ద ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

7వ డివిజన్ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లైన్ లోని ప్రజలు తమ చొరవతో, స్వంత డబ్బులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు వలన ఏదైనా సంఘటన జరిగితే గుర్తించడానికి వీలు కలుగుతుందని, ప్రజల సహకారానికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం, సామర్థ్యం పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, మేయర్ ధర్ని మధుకర్ తో కలిసి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.

మంచిర్యాల జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీ దొంతినేని వెంకటేశ్వరరావు, శ్యామల గార్ల దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీమతి లెక్కల శ్రీదేవి గారికి, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

జైపూ్పిషత్అభిృద్ధిఅధికాి(MPDO)ాశ్ీపతిబాపూాుబాధ్యతుస్ీకిచాు.ఆస్టు1,2026నజిినఈకా్యక్ో,ఆయనకుపచాయతీకా్యద్శుు,కా్యాయసిబ్బదిశుభాకాక్షుతెియజేసి,ఘనాసన్ానిచాు.

మండలకేంద్రంలోవిద్యుత్శాఖకాంట్రాక్టర్నిర్లక్ష్యం,నాణ్యతాలోపంస్థానికులప్రాణాలకుముప్పుతెస్తోంది.మూడునెలలక్రితంఏర్పాటుచేసినవిద్యుత్స్తంభాలు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని జైపూర్ వాసులుకరెంటుసరఫరాప్రారంభంకాకముందేవంగిపోయిప్రమాదకరంగామారాయి.దీనిపైప్రజలుతీవ్రఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు.

జైపూర్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాణ్యతా లోపం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కరెంట్ సరఫరా ప్రారంభం కాకముందే వంగిపోవడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి సహోదరి, రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి మేనత్త అయిన శ్రీమతి సువర్ణ వనమాల గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శక్తి డిపార్టుమెంట్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని సూచించారు.

రామగుండం నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటి నిల్వలను అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన, గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, అభివృద్ధిపై అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆయన ఛలో మంచిర్యాల కార్యక్రమ సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.