మంచేరియల్, 2026-07-01
మంచిర్యాల జిల్లా రెవెన్యూ శాఖలో 40 ఏళ్ల పాటు సేవలందించిన తహసీల్దార్ శ్రీ పుప్పాల హనుమంత రావు, శ్రీమతి జ్యోతి గార్ల పుణ్యదంపతులను టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రెవెన్యూ శాఖలో 40 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన తహసీల్దార్ శ్రీ పుప్పాల హనుమంత రావు, శ్రీమతి జ్యోతి గార్ల పుణ్యదంపతులకు మంచిర్యాల జిల్లా టీఎన్జీవో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభలో, కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, తహసీల్దార్ శ్రీ పుప్పాల హనుమంత రావు రెవెన్యూ శాఖలో ప్రతి ఉద్యోగికి మార్గదర్శిగా ఉంటూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
ఈ సన్మాన సభలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి రాంకుమార్, కోశాధికారి ఏ సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి సునీత ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, సెక్రటరీ అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసుఫ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.











