మంచేరియల్, జూన్ 29, 2026
జిల్లాలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు, పోలీసు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెలకొన్న ఎస్.సి., ఎస్.టి. సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్-కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి పోలీస్, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు, ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న ఎస్.సి., ఎస్.టి. సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్. సి., ఎస్. టి. ల అభివృద్ధి, కేసులు, ఎన్ ఫోర్స్ మెంట్ అమలు అంశాలపై తీసుకుంటున్న చర్యలపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎస్.సి., ఎస్.టి. లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఇండ్లు నిర్మించుకోలేని వారికి గుత్తేదారుల సమన్వయంతో ఇల్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రులు తదితర సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రగతికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకులాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్థుల హాజరు శాతం పెంపొందించాలని, విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేయాలని తెలిపారు. పోలీసు శాఖ పరిధిలోని అట్రాసిటీ కేసులు కార్యచరణ ప్రకారంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. అట్రాసిటీ కేసులలో తప్పుడు కేసులు నమోదు చేసిన వాటి వివరాలను స్పష్టంగా రికార్డులలో నమోదు చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కేసులలో ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులో వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
అధికారుల చొరవతో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ ద్వారా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గంజాయి, నిషేధిత మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక నిఘా చేపట్టాలని, జిల్లాలో క్రయ విక్రయాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో బెల్ట్ షాపులు అధికమవడంతో యువత పక్కదారి పడుతుందని, నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుధ్యం, త్రాగునీరు ఇతర ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల సంబంధిత జనాభా అధికంగా ఉన్న జిల్లాలోని 7 గ్రామాలకు అదనంగా 20 లక్షల రూపాయల చొప్పున గ్రామపంచాయతీ నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. విజిలెన్స్ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరించాలని, సంక్షేమ వసతి గృహాలలో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు.











