మంచేరియల్, 2026-07-01
మంచిర్యాల జిల్లా రెవెన్యూ శాఖలో 39 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన తహసీల్దార్ శ్రీ పిన్న రాజేశ్వర్ సునీత దంపతులను టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ హాజరై, దంపతులను అభినందించారు.
మంచిర్యాల జిల్లా రెవెన్యూ శాఖలో గత 39 సంవత్సరాలుగా సుదీర్ఘ సేవలు అందించిన తహసీల్దార్ శ్రీ పిన్న రాజేశ్వర్ సునీత దంపతులను టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ హాజరయ్యారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన సభలో దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో తహసీల్దార్ శ్రీ పిన్న రాజేశ్వర్ సార్ ఎల్లప్పుడూ ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తూ, మార్గదర్శిగా ఉంటూ శాఖకు వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన హయాంలో ఉద్యోగులు సంతృప్తికరంగా పనిచేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో ముందువరుసలో నిలిచారని, ఆయన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
ఈ సన్మాన సభలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి రాంకుమార్, కోశాధికారి ఏ సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి సునీత ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, సెక్రటరీ అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసుఫ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.











