హైదరాబాద్, 31-07-2026
రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డైరెక్టర్ శ్రీమతి నిఖిల, అదనపు డైరెక్టర్ శ్రీ మురళీకృష్ణతో పాటు శాఖ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గారికి మత్స్యశాఖ డైరెక్టర్ శ్రీమతి నిఖిల, అదనపు డైరెక్టర్ శ్రీ మురళీకృష్ణతో పాటు శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి గారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వినియోగదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్లో అందుబాటులో ఉన్న చేపల వంటకాలు, మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారమని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చేపల వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మరింత మంది ప్రజలకు ఫిష్ క్యాంటీన్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, క్యాంటీన్‌ను మరింత ఆధునికంగా అభివృద్ధి చేయాలని సూచించారు.












