మంచేరియల్, 2026-07-31
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో ఒకే ఆపరేషన్ థియేటర్లో జూలై నెలలో 100 ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఆసుపత్రి బృందం యొక్క అంకితభావం, నైపుణ్యం మరియు సమన్వయానికి ప్రతీకగా నిలుస్తోంది.
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో జూలై నెలలోనే ఒకే ఆపరేషన్ థియేటర్లో 100 ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడం ఒక గర్వకారణమైన మైలురాయిగా నిలిచింది.
ఈ విజయం కేవలం ఒక్కరి కృషి కాదని, ఇది మొత్తం బృందం యొక్క అంకితభావం, నైపుణ్యం, సమన్వయం మరియు రోగుల పట్ల ఉన్న సేవాభావానికి నిదర్శనమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ విజయానికి సహకరించిన సూపరింటెండెంట్, RMOల బృందం, ఆర్థోపెడిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు & సీనియర్ రెసిడెంట్లు, అనస్థీషియా విభాగాధిపతి & వైద్యుల బృందం, OT నర్సింగ్ బృందం, OT సిబ్బంది, వార్డ్ సిస్టర్స్, ఆరోగ్యశ్రీ బృందం మరియు ప్రతి సహచరునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
"కలిసి సేవ చేద్దాం... కలిసి విజయాన్ని సాధిద్దాం... కలిసి మరెన్నో మైలురాళ్లను చేరుకుందాం" అని ఈ సందర్భంగా Prof & HOD Dr.Rajesh (MBBS,MS(ortho), Department of orthopaedics, GGH Mancherial) ఆశాభావం వ్యక్తం చేశారు.












