మంచేరియల్, 2026-07-31
మందమర్రి మండలంలోని హిందూ గార్డెన్ వివాదాస్పద భూమి కేసులో ఉట్నూరు ట్రైబల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏజెన్సీ భూభాగంలో 1/70 చట్టానికి విరుద్ధంగా, తప్పుడు పత్రాలతో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై కోర్టు స్పష్టత ఇచ్చింది. యాజమాన్యం అప్పీల్‌ను తిరస్కరించింది.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని హిందూ గార్డెన్ వివాదాస్పద భూమి కేసులో ఉట్నూరు ట్రైబల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏజెన్సీ భూభాగంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా, తప్పుడు సాదా బైనామా పత్రాలతో హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్‌ను అక్రమంగా నిర్మించినట్లు కోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగబద్ధమైన చట్టాలకు వ్యతిరేకంగా నిర్మించిన ఈ కట్టడంపై హిందూ గార్డెన్ యాజమాన్యం వేసిన అప్పీల్‌ను ఉట్నూరు ట్రైబల్ కోర్టు తిరస్కరించింది. గతంలో ఎస్డీసీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని మందమర్రి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది.
గిరిజన హక్కుల కోసం గత పదేళ్లుగా ఆదివాసీలు చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి న్యాయస్థానంలో విజయం దక్కింది. ఈ పోరాటంలో అండగా నిలిచిన పాత్రికేయులకు, గిరిజన, గిరిజనేతర నాయకులకు, ప్రజలకు నాయకపోడు సంఘం, ఆదివాసీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.











