మంచిర్యాల నియోజకవర్గంలోని జంగల్ సఫారీ, ఏసీసీ క్వారీ వద్ద తెలంగాణ అటవీ శాఖ మరియు సంయుక్తంగా దేశీయ స్థాయి తొలి ఫారెస్ట్ సఫారీ మారథాన్‌ను నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని జంగల్ సఫారీ, ఏసీసీ క్వారీ వద్ద తెలంగాణ అటవీ శాఖ మరియు సంయుక్తంగా నిర్వహించిన దేశీయ స్థాయి తొలి ఫారెస్ట్ సఫారీ మారథాన్‌లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన 30, 10, 5 రన్నింగ్ కార్యక్రమాన్ని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు ఐఏఎస్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, డైరెక్టర్ శాంత రామ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన అటవీ శాఖ అధికారులను అభినందించారు.
అడవుల అందాలను పరిచయం చేస్తూ, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మారథాన్ నిర్వహించారు.









