హైదరాబాద్, 2026-08-29
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు పలువురు అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, భారత హాకీ దిగ్గజం, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీఎండీ సోనిబాలదేవి, హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొండా విజయ్, క్రీడా శాఖ అధికారులు, హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరి, చైర్మన్ శివసేన రెడ్డి, వీసీఎండీ సోనిబాలదేవి, హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొండా విజయ్, అధికారులు, క్రీడాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ హాకీ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి వాకిటి శ్రీహరి, చైర్మన్ శివసేన రెడ్డి ప్రారంభించారు.
క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు
జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మేజర్ ధ్యాన్‌చంద్ భారతీయ క్రీడాస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప క్రీడాకారుడని కొనియాడారు. ధ్యాన్‌చంద్ తన అద్భుతమైన ఆటతీరు, క్రమశిక్షణ, ఏకాగ్రతతో భారత హాకీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. ఆయన జీవితం ప్రతి క్రీడాకారుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆటలపై మక్కువ, ఏకాగ్రత, క్రమశిక్షణతో విజయం సాధించవచ్చని మంత్రి అన్నారు. ప్రస్తుత తరం యువత సోషల్ మీడియా రీల్స్‌పై కాకుండా, తమ భవిష్యత్తు కోసం క్రీడలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రీల్స్ కోసం కాకుండా.. రియల్ లైఫ్ కోసం ఆటలు ఆడండి అని మంత్రి యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను క్రీడారంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.












