పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ఆయన ప్రారంభించారు. ఈ చెరువును రూ.73 లక్షల వ్యయంతో అభివృద్ధి చేశారు.
పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమైంది. ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ఆయన ప్రారంభించారు.
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన () పథకం ద్వారా రూ.73 లక్షల వ్యయంతో మైసమ్మ చెరువును అభివృద్ధి చేశారు. చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.6 కోట్లతో 11 గ్రామీణ చెరువులను సుందరీకరించారు. అభివృద్ధి చేసిన గ్రామీణ చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ, ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.
కాకినాడ నియోజకవర్గం పరిధిలో సుందరీకరించిన 14 చెరువులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని శ్రీ పవన్ కళ్యాణ్ తిలకించారు.
చెరువుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించి, చిన్నారులకు చాక్లెట్లు పంచారు. చెరువు గట్టున ఉన్న భారీ వృక్షాల వయసును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఫకృద్ధీన్ పాలెంలోని గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు.











