మంచిర్యాల జిల్లా కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జిల్లా శిక్షణ శిబిరం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు.
హోటల్ సుచిత్ర ఇన్ లో జరిగిన ఈ శిబిరంలో, రఘునాథ్ వెరబెల్లి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం, ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ శిబిరం ద్వారా పార్టీ కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సమాచారం.
రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశంలో ఈ శిక్షణ కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణ శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










