మంచేరియల్, 2026-08-31
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని లో సోమవారం (31.08.2026) నాడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 // సముదాయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని లో సోమవారం (31.08.2026) నాడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 // (, -) సముదాయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 51 // సముదాయాల అభివృద్ధి, సంక్షేమం మరియు సామాజిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. విముక్తి, సంచార మరియు అర్ధసంచార సముదాయాల చారిత్రక నేపథ్యం, సామాజిక స్థితిగతులు, విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా 51 // సముదాయాలకు చెందిన ప్రతినిధులు, సభ్యులు పాల్గొని తమ సమస్యలు, అవసరాలు మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సముదాయాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వారు అభినందించారు.
జిల్లాలోని // సముదాయాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మరింత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీమతి నీరటి రాజేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది, 51 // సముదాయాల ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












