ఓదెల, 2026-06-05
స్నేహం అంటే కేవలం కలిసి ఆడుకోవడమే కాదు, కష్టంలో చేయూతనివ్వడం, ఆపదలో అండగా నిలబడటం. అలాంటి ఆదర్శ స్నేహానికి నిలువెత్తు నిదర్శనం హై స్కూల్, ఓదెల 1996-1997 బ్యాచ్. ఈ బ్యాచ్ సభ్యులు 29 ఏళ్లు గడిచినా తమ స్నేహ బంధాన్ని వీడకుండా, ఒకరికొకరు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్నేహం అంటే కేవలం కలిసి ఆడుకోవడమే కాదు, కష్టంలో చేయూతనివ్వడం, ఆపదలో అండగా నిలబడటం. అలాంటి ఆదర్శ స్నేహానికి నిలువెత్తు నిదర్శనం హై స్కూల్, ఓదెల 1996-1997 బ్యాచ్. ఈ బ్యాచ్ సభ్యులు 29 ఏళ్లు గడిచినా తమ స్నేహ బంధాన్ని వీడకుండా, ఒకరికొకరు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామాల నుంచి ఒకే గూటికి
ఓదెల మండలంలోని కొమిర, మడక, నాంసం పల్లె, అబిడి పల్లె గ్రామాల నుంచి ఎన్నో ఆశలతో ఓదెల ప్రభుత్వ పాఠశాలలో ఒకేచోట చేరిన విద్యార్థులం మేము. ఆటలు, పరీక్షలు, ఉపాధ్యాయుల చీవాట్లు... అన్నీ కలిసే పంచుకున్నాం. కాలం గడిచి 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా బ్యాచ్ మిత్రులలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఇంకొందరు సొంత వ్యాపారాల్లో స్థిరపడ్డారు. మరికొందరు సొంత ఊరిపై మమకారంతో వ్యవసాయం చేస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
వాట్సాప్ తో తెగిపోని బంధం
శరీరాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, మా మనసులు మాత్రం ఒకేచోట ముడిపడి ఉన్నాయి. అందుకే మేము ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రూపు పేరు పలకరింపుల గ్రూపు కాదు, ఇది బాధ్యతల గ్రూపు. ఎవరికైనా కష్టం లేదా ఆపద సంభవించినప్పుడు వెంటనే స్పందిస్తాం. స్వార్థం కోసం కాకుండా, ఆపదలో ఉన్న మిత్రుడిని ఆదుకోవాలనే మానవత్వంతో ఒకరికొకరు ఆర్థిక సహకారం అందిస్తున్నాం.
ఆదర్శంగా నిలుస్తున్న బ్యాచ్
29 సంవత్సరాల తర్వాత కూడా ఒకరినొకరు పేరుపేరునా గుర్తుంచుకోవడం గొప్ప విషయం. అయితే, గుర్తుంచుకోవడంతో ఆగకుండా, అవసరమైన వారికి చేయూతనివ్వడం మరింత గొప్పది. నేటి రోజుల్లో స్నేహం కేవలం మాటల్లోనే మిగిలిపోతుంది. కానీ ఓదెల 96-97 బ్యాచ్ మాత్రం స్నేహానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. కలిసి చదివాం, కలిసి ఎదిగాం, కలిసి ఆదుకుంటాం అనే నినాదంతో ముందుకు సాగుతోంది.
సేవా కార్యక్రమాలు
ఈ బ్యాచ్ సభ్యులు తమ పరిధిలో సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. వీరి సేవా కార్యక్రమాలు ఇతర బ్యాచ్లకు, నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.











