హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ ప్రజలందరికీ రక్షా బంధన్ పండుగ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ రక్షా బంధన్ అని ఆయన పేర్కొన్నారు.

సోదరుడుసోదరి బంధం జీవితాంతం ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో కొనసాగాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాతృత్వం వెల్లివిరియాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
రాఖీ కట్టే ప్రతి చేయి ఆనందంగా ఉండాలని, రాఖీ కట్టించుకునే ప్రతి సోదరుడు బాధ్యతగా నిలవాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటా ప్రేమానురాగాలు వెల్లివిరియాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు.