మంచేరియల్, 8 September
మంచిర్యాల జిల్లాలో ఈనెల 14 నుండి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం స్థానిక కన్వెన్షన్ హాల్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలి మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఈనెల 14 నుండి జరగనున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను వినాయక మండపాలా నిర్వాహకులు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. మంగళవారం స్థానిక ఏం కన్వెన్షన్ లో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీసులు చేపట్టే భద్రత ఫై సానుకూలంగా మాట్లాడినందుకు చాల సంతోషకారం అన్నారు. ప్రతి వినాయక మండపం వద్ద పోలీసుల సూచనలు పాటించాలని,మండపం నిర్వాహకులు తప్పనిసరిగా సమాచారం అందజేయాలనీ, ఎలాంటి అపోహలకు తవివ్వవద్దని తెలిపారు. మండపం కు విద్యుత్ కనెక్షన్ అనుమతి పొందాలని, రోడ్లు పూర్తిగా మూసేసేవిధంగా ఏర్పాటు చేయవద్దని,నిమజ్జనం రోజు పోలీసుల సూచనల మేరకే సమయానికి తరలించాలని, మద్యం సేవించరాదని, ఎలాంటి గొడవలు కాకుండ శాంతియుతంగా తరలించాలని సూచించారు.ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డిజే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వబొమని తెలిపారు. మండపాల వద్ద తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.మండపం వద్ద మద్యం, జూదం లాంటివి ఉండకూడదని, ఆకాతాయిల ఆగడాలను ఉపేక్షించమని, రౌడీ షీటర్స్, పాత నేరస్తుల ఫై నిఘా పెంచుతామణి, అంతే కాకుండా పలువురిని బైండొవర్ చేస్తామన్నారు. పట్టణంలో రోడ్ల పనులు జసరుగుతున్న నేపథ్యంలో నిమజ్జనం రోజు దారి మల్లించడం జరగనుందని పేర్కొన్నారు. ప్రతి మండపం వద్ద కమిటీ సభ్యులు రాత్రి వేల నిద్రించాలని పేర్కొన్నారు. కాగా నిర్వాహకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో పట్టణ సిఐ ప్రమోద్ రావు, ఎస్ ఐ లు మధుసూదన్,రమేష్,శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.












