పెద్దపల్లి, 3 September
ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో, బుధవారం శ్రీశైలం ఆలయ సందర్శనలో భాగంగా, తెలంగాణ దేవాలయ శాఖ స్థపతి వల్లినయాగన్ తో కలిసి శ్రీశైల జగద్గురు డా. చెన్న సిద్దరామ పండితారాధ్య భగవత్పదులను గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఓదెల మల్లన్న ఆలయం మాస్టర్ ప్లాన్ ను వారికి క్షుణ్ణంగా వివరించి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
*జగద్గురు డా. చెన్న సిద్దరామ పండితారాధ్య భగవత్పదులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు..* ఓదెల శ్రీ. మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం రోజున శ్రీశైలం ఆలయ సందర్శన కార్యక్రమంలో తెలంగాణ దేవాలయ శాఖ స్థపతి వల్లినయాగన్ గారితో కలిసి శ్రీశైల జగద్గురు డా. చెన్న సిద్దరామ పండితారాధ్య భగవత్పదులు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి ఓదెల మల్లన్న ఆలయం యొక్క మాస్టర్ ప్లాన్ ను క్షుణ్ణంగా వివరించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసున్న గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. తదుపరి శ్రీశైల జగద్గురు డా. చెన్న సిద్దరామ పండితారాధ్య భగవత్పదులు గారు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారిని ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో ఓదెల మల్లన్న ఆలయ ఈ.వో, ప్రధాన అర్చకులు, కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు...












