మంచేరియల్, 3 September
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీని ప్రదర్శించారు. మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు.
*కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల,420 హామీల చేయాలని జిల్లా కేంద్రంలో 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన.* కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనపై, జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర చౌరస్తా నుండి మార్కెట్ రోడ్ నుండి బస్టాండ్ బస్టాండ్ మీదగా బెల్లంపల్లి చౌరస్తా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను మరియు 420 హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రజలకు పంచుతూ,420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శించిన మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు. అనంతరం వారు మాట్లాడుతూ ➡️ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు,420 హామీలు 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చిందని అన్నారు ➡️ 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న హామీలను 1000 రోజులు పూర్తి అయిన ఎందుకు అమలు చేయడం లేదని వారు అడిగారు. ➡️అబద్ధపు హామీలతో గెలిచిన తర్వాత హామీలను గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షాలను తిట్టడమే, కొట్టడమే,అక్రమ కేసులు పెట్టడమే ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ➡️ అదేవిధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి A1 అని తెలిపారు. ➡️ నియోజకవర్గంలో ప్రతిపక్ష BRS నాయకులను బెదిరించడం,కొట్టడం ఎవరైనా ఎదురుతిరిగితే జైల్లోకి పంపించడం తప్ప ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేసింది ఏమీ లేదని అన్నారు. ➡️ అధికారులను మరియు గుండాలను అడ్డుపెట్టుకొని లో అన్ని వర్గాల ప్రజల వద్ద నుండి 500 కోట్లను ఈ A1 ఎమ్మెల్యే దోచుకున్నారని తెలిపారు. ➡️ అదేవిధంగా లో దోచుకోవడానికి మరో ఆస్త్రంగా G.O.22A నిషేధిత జాబితాలో 10332 ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టి మరల ప్రజల వద్ద నుండి దోచుకోవడానికి ఎమ్మెల్యే సిద్ధమయ్యారని తెలిపారు ➡️ అదేవిధంగా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ఇకపై ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ఇవ్వని పక్షంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపినేని మహిళలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ➡️ అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని వెంటనే నెరవేర్చాలని వారి డిమాండ్ చేశారు. ➡️ రైతులకు దురదృష్టవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగి చనిపోతే, రైతు బీమా 5 లక్షలు రూపాయలు రైతు కుతి గత BRS ప్రభుత్వం అందజేసేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బీమాకు కనీసం ప్రీమియం కూడా కట్టడం లేదని తెలిపారు. ➡️ అదేవిధంగా జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చారని అన్నారు. ➡️ ప్రజలను,విద్యార్థులను వ్యాపారస్తులను,ఆటో డ్రైవర్లను,ఆడపడుచును ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ➡️ అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని వారు వెంటనే వారి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ➡️ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రుల కుమార్తె ఎదిరిస్తున్నారని తెలిపారు. ➡️ అదేవిధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అన్యాయ పాలనను చూసి, అహంకార ధోరణి చూసి సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్నారని అన్నారు. ➡️ ప్రేమ్ సాగర్ రావు దుర్మార్గపు పాలనలో మొదలుగా ప్రతిపక్ష నాయకులపై ఆ తర్వాత ప్రజలపై దాడులు చేశారు, ఇప్పుడు సొంత పార్టీ నాయకులపై కూడా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ➡️ తెలంగాణ రాష్ట్రానికి A1 రేవంత్ రెడ్డి అని అదేవిధంగా జిల్లాకు A1 ప్రేమ్ సాగర్ రావని తెలిపారు. ➡️ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాదు A1 ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,TBGKS నాయకులు,పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు, వద్యార్థి నాయకులు,యువజన విభాగ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.










