పెద్దపల్లి, 2026-06-05
అర్హులకు మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు తెలిపారు. సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో ఆయన పలు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
అర్హులకు మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు తెలిపారు. సుల్తానాబాద్ పట్టణంలోని 15వ వార్డు పూసాలలో, పెద్దపల్లి పట్టణంలోని 10, 11 వ వార్డులు (ఉమ్మడి రంగంపల్లి), 27వ వార్డు (సుభాష్ నగర్), 25, 33 వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మాట తప్పకుండా ఇస్తున్నామని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. పెద్దపల్లి పట్టణంలో నిర్మిస్తున్న దాదాపు 370 ఇందిరమ్మ ఇండ్లు దసరా, దీపావళి నాటికి ప్రారంభానికి సిద్ధమవుతాయని తెలిపారు.
పేద, బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి గూడు నీడ కల్పించాలన్నది ఇందిరమ్మ ఆశయమని అన్నారు.











