హైదరాబాద్, 2026-06-05
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి, పలువురు పార్టీ అగ్రనేతలను హైదరాబాద్లోని వారి నివాసాల్లో కలిసి రాఖీలు కట్టారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి, పలువురు బీజేపీ ప్రముఖులను హైదరాబాద్లోని వారి నివాసాల్లో కలిసి రాఖీ కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గార్లను వారి నివాసాల్లో కలిసి రాఖీ కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికే కాకుండా సోదరభావం, పరస్పర విశ్వాసం, ఆత్మీయత, సమాజ ఐక్యతకు ప్రతీక అని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. కుటుంబాల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు సమాజం మొత్తం విస్తరించి, ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.
దేశ రక్షణ, ప్రజా సేవ, సమాజ సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులకు రాఖీ కట్టి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కందుల సంధ్యారాణి తెలిపారు.
ఈ రాఖీ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, ఆత్మీయతను నింపి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.












