రామకృష్ణాపూర్ (ప్రజావార్త) ఆగస్టు 27
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఫేజ్-2 నోటీసుల జారీ, పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఫేజ్-2 నోటీసుల జారీ, పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో 1, 2, 3 పోలింగ్ బూత్‌లలో కొనసాగుతున్న సర్ ఫేస్-2 నోటీసుల ప్రక్రియను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి వొడ్నాల శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు, బీఎల్ఏ, స్థానికులతో మాట్లాడి నోటీసుల ప్రక్రియపై వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు సర్ ప్రక్రియ చేపట్టినప్పటికీ, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఫేజ్-2 నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసుల్లో పేర్కొన్న వివరాలను పరిశీలించి, అవసరమైన పత్రాలు, సమాచారాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలకు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భీమ మల్లేష్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, బీఎల్ఓ, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











