హైదరాబాద్, 4 September
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అత్తాపూర్లోని ఇస్కాన్ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు* కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అత్తాపూర్లోని ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. శ్రీకృష్ణుడి జీవితం ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, మానవతా విలువలకు ప్రతీక అని మంత్రులు పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సందేశాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, శ్రీకృష్ణుడి బోధనలను ఆచరించాలని మంత్రులు ఆకాంక్షించారు.












