అంతర్గాం, 2026-11-26
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠికను చదివించి రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు మరియు బాధ్యతలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోస్టర్ తయారీ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రాజ్యాంగ విలువలు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం మరియు సౌభ్రాతృత్వం వంటి అంశాలను తమ చిత్రాలు, పోస్టర్ల ద్వారా చక్కగా ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సి. సబిత, ఎం. రాజ్‌కుమార్, బి. సౌజన్య, యు. నాగవేణి, ఈ. శ్యామల, చ. స్వరూప, ఎస్. వెంకటస్వామి, ఎం. స్వరూప, టి. సూర్యభగవాన్, సునీత దత్తా, రోజినా, జి. అనిల్ కుమార్, చ. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సోషల్ స్టడీస్ విభాగ ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగోతు శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు.







