హైదరాబాద్, 2026-11-28
తెలంగాణలో నుంచి 22 వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశానికే ఆదర్శంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. క్రీడల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రచార కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, నోడల్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రచార కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, నోడల్ ఆఫీసర్ల సమావేశంలో మంత్రి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి(క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి(క్రీడలు) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సోనిబాలదేవి, నోడల్ ఆఫీసర్లు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. క్రీడల నిర్వహణకు జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించడంతో పాటు అవసరమైన నిధులను అందిస్తున్నామని, అదనపు నిధులు అవసరమైతే సమకూరుస్తామని వెల్లడించారు. క్రీడా వేదికల అభివృద్ధి, క్రీడా సామగ్రి, క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న క్రీడా మౌలిక సదుపాయాలు భవిష్యత్ తరాలకు అందించే విలువైన ఆస్తులని పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
క్రీడల నిర్వహణలో జిల్లా ఇన్చార్జి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలకతీతంగా భాగస్వాములను చేయాలని సూచించారు. పోలీస్, మున్సిపల్, విద్యా శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం
ఖేలో ఇండియా క్రీడల ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేయాలని మంత్రి సూచించారు. కలెక్టరేట్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల వాహనాలపై ఖేలో ఇండియా మస్కట్ స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించాలి. ఆకాశవాణి ద్వారా కూడా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి. సినీ ప్రముఖులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులతో ప్రచారం చేయించాలి. స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లను భాగస్వాములను చేయాలి. నుంచి 10 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.







