మంచేరియల్, 27-07-2026
గోవులకు గౌరవం, రక్షణ కల్పించే 'గో సమ్మన్ ఆహ్వాన అభియాన్'లో భాగంగా, సంపూర్ణ గోహత్య నిషేధం, గోమాతకు జాతీయ గౌరవం దక్కాలని కోరుతూ సంతకాల సేకరణ ఉద్యమాన్ని గోసంరక్షణ జిల్లా సేవకులు చేపడుతున్నారు. ఈ సంతకాల ప్రతులను వివిధ ఉన్నత అధికారులకు అందజేయనున్నారు.
గోవులకు గౌరవం, రక్షణ కల్పించే ఉద్యమంలో భాగంగా 'గో సమ్మన్ ఆహ్వాన అభియాన్' నిర్వహిస్తున్నట్లు గోసంరక్షణ జిల్లా సేవకులు తెలిపారు. సంపూర్ణ గోహత్య నిషేధం, గోమాతకు జాతీయ గౌరవం దక్కాలని, గో సేవ కోసం ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని కోరుతూ భారతదేశ వ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమం చేపడుతున్నారు.
ఈ ఉద్యమంలో భాగంగా 27-07-2026 సోమవారం రోజున సేకరించిన సంతకాల ప్రతులను స్కానింగ్ చేసి, పిడిఎఫ్‌గా మార్చి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రిలకు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపించడానికి గోసంరక్షణ జిల్లా సేవకులు ఈరోజు కలెక్టర్‌ను కలవనున్నారు.












