ఎల్కతుర్తి, 18 November
సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలాలను ప్రతి మాదిగ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా ఎమ్మార్పీఎస్ కో-ఇన్చార్జి తడుగుల విజయ్ మాదిగ పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలాలను ప్రతి మాదిగ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా ఎమ్మార్పీఎస్ కో-ఇన్చార్జి తడుగుల విజయ్ మాదిగ పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం మండల కేంద్రంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) మండల అధ్యక్షుడు గొల్లమందల చరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి తడుగుల విజయ్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించుకున్న హక్కులు, అవకాశాలను ప్రతి మాదిగ విద్యార్థి అందిపుచ్చుకోవాలని సూచించారు. వర్గీకరణ ఫలాలు కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగ విద్యార్థుల అభ్యున్నతికి మార్గం చూపాలని అన్నారు. అందుకు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య, వివిధ పోటీ పరీక్షల్లో రాణించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మాదిగ విద్యార్థులకు విద్య పట్ల అవగాహన కల్పించి, వారిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడంలో ఎంఎస్ఎఫ్ నాయకులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రతి గ్రామంలో విద్యార్థులను సంఘటితం చేస్తూ నూతన ఎంఎస్ఎఫ్ కమిటీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్ఎఫ్ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలను దాటి జాతీయ స్థాయి వరకు పటిష్టమైన కమిటీ నిర్మాణం చేపట్టాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ఎంఎస్ఎఫ్ను బలమైన విద్యార్థి ఉద్యమ శక్తిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఎంఎస్ఎఫ్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమానికి మండలంలోని విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తడుగుల విజయ్ మాదిగ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు కొయ్యడ రాజేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి చిలుమల వినోద్ మాదిగ, మండల సీనియర్ నాయకులు అడ్డూరి నవీన్ మాదిగ, బొంకూరి వంశీ మాదిగ, ఇంద్రనగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు నమీండ్ల ప్రవీణ్ మాదిగ, గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు నమీండ్ల నరేష్ మాదిగ, కోతులనడుమ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల అనిల్ మాదిగ, చింతలపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు శనిగరం వంశీ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు అల్లకొండ బాలస్వామి మాదిగ, అడ్డూరి సుధాకర్ మాదిగ, దామెర ఎమ్మార్పీఎస్ నాయకుడు కృష్ణంరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.







