వేలాల గ్రామంలోని పాఠశాలలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ శ్రీమతి డేగ వప్న నగేష్ రిబ్బన్ కట్ చేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
వేలాల గ్రామంలోని పాఠశాలలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ శ్రీమతి డేగ వప్న నగేష్ రిబ్బన్ కట్ చేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఉదయాన్నే పోషకాహారం అందించడం వల్ల వారి చదువుపై శ్రద్ధ పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని, పిల్లలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, వారి విద్యాభ్యాసంలో పురోగతి సాధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోషకాహార లోపాన్ని తగ్గించి, పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శారద, ఉప సర్పంచ్ సుందిల్లా రాజలింగు, పంచాయతీ కార్యదర్శి శ్రీ రాకేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.