మంచిర్యాల పట్టణంలో గణపతి నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను పోలీస్ శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు ఎం కన్వెన్షన్ హాల్లో పోలీస్ అధికారులు, వివిధ గణేష్ మండలి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల పట్టణంలో జరగనున్న గణపతి నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంచిర్యాలలో ఏర్పాటు చేసిన వివిధ గణేష్ మండలి ఆర్గనైజర్లు హాజరయ్యారు. పోలీస్ శాఖ అధికారులు నిమజ్జన ఏర్పాట్లు, రూట్ మ్యాప్ ను మండప నిర్వాహకులకు వివరించారు.
ప్రతి గణేష్ మండలి కమిటీ పోలీస్ శాఖ సూచనలను తప్పకుండా పాటించి, శోభాయాత్రను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ సంవత్సరం పోలీస్ శాఖ రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం, మంచిర్యాల ఏసీసీ నుండి ప్రారంభమై, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా మీదుగా ఐబీ చౌరస్తా వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఐబీ చౌరస్తాలో మున్సిపల్ శాఖ వేదిక ఏర్పాటు చేస్తుంది. అక్కడ హిందూ ఉత్సవ సమితి వేదిక నుండి అన్ని గణేష్ మండపాలకు స్వాగతం పలుకుతారు.
అధికారుల సూచనలకు అనుగుణంగా మండపాల నిర్వాహకులు శోభాయాత్రను నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పట్టణ సీఐ ప్రమోద్ రావు, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, వివిధ గణేష్ మండలి నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












