మంచేరియల్, 2026-07-31
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, అభివృద్ధిపై అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆయన ఛలో మంచిర్యాల కార్యక్రమ సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, అభివృద్ధిపై అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యనిర్వహణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఛలో మంచిర్యాల కార్యక్రమ సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి, త్రాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని తెలిపారు.
ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం–ఛలో మంచిర్యాల ర్యాలీ, సభ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్య నిర్వహణ కమిటీ ప్రతినిధులు తట్ర అర్జున్, నైతం లక్ష్మణ్, సోయం జంగు, కుడిమేత తిరుపతి, గంజి రాజన్న, ఆడ జంగు, పెంద్రం హనుమంతు, కొడప అనిల్, కుర్సెంగ వెంకటేష్, పల్లె పృథ్విరాజ్, మడావి వెంకటేష్, పెంద్రం తిరుపతి, గావుడె శ్రావణ్, మేసినేని అరుణ్, గెడం ప్రవీణ్ పాల్గొన్నారు.












