మంచిర్యాల (ప్రజావార్త) సెప్టెంబర్ 14
వణకషణేధేలజలలూధలోనజనథహలసకలనలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహ పంపిణీకార్యక్రమం జరిగింది. సనలోకూడనవహలకబదలటటవనకలనేూజలనఈసదభలన.
పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, రసాయనాలతో కూడిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిస్తూ, మంచిర్యాల్ జిల్లా తిమ్మాపూర్ పరిధిలోని మంజునాథ హిల్స్ కాలనీలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
వినాయక చతుర్థి పండగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దాతలు ఆవుల జైపాల్ రెడ్డి,చిందం శంకర్ విగ్రహాలను సమకూర్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీరు, వాతావరణం కలుషితమై భవిష్యత్ తరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
లైన్స్ క్లబ్ ప్రతినిధులు, కాలనీ పెద్దల సమక్షంలో స్థానిక ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా మట్టి ప్రతిమలను స్వీకరించారు. సమాజ హితం కోసం ముందుకు వచ్చి ఉచితంగా విగ్రహాలను అందజేసిన దాతలు ఆవుల జైపాల్ రెడ్డి, చిందం శంకర్ లకు కార్యక్రమాన్ని నిర్వహించిన లైన్స్ క్లబ్ సభ్యులకు కాలనీ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.











