మంచేరియల్, 14 September
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాలనే వాడాలని ఆయన సూచించారు.
మట్టి వినాయకున్ని పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం! మంచిర్యాల : ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షించడానికి మట్టి వినాయకుని భక్తితో పూజించి పర్యావరణాన్ని రక్షించాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాసవి మెడికల్ & జనరల్ స్టోర్స్ వద్ద మంచిర్యాల వాసవి క్లబ్, యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయ ని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజిద్దాం. మట్టి వినాయకుడి ప్రతిష్టాపన అనేది కేవలం పూజా విధానం మాత్రమే కాదు.మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే బాధ్యతాని చెప్పారు.. వాసవి క్లబ్, యూత్ క్లబ్ సభ్యులు చేపట్టిన ఈ పర్యావరణహిత కార్యక్రమం అభినందించి, భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ కార్యదర్శి కొండ చంద్రశేఖర్, జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, క్యాబినెట్ సెక్రటరీ సేవా కేశెట్టి వంశీకృష్ణ, కార్పొరేటర్ మదన్ శెట్టి సత్యనారాయణ, చిలువేరు శ్రీనివాస్, జిల్లా క్యాబినెట్ అధికారులు ఉత్తూరి రమేష్, కాసం సతీష్, వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శ కోశాధికారులు వెనిశెట్టి రాఘవేంద్ర, గుండా మనోహర్, బండ శ్రీనివాస్, వాసవి యూత్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శు కోశాధికారులు ముక్త విశ్వాస్, బోనగిరి ప్రసన్నకుమార్, గందె శ్రీ అనిల్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, టీపీసీసీ సభ్యులు కొండా శేఖర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..











