జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ వన్యాప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీతో పాటు, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ వన్యాప్రాణి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి, అనంతరం బహుమతుల ప్రదానం చేశారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి రాజ్యలక్ష్మి, విద్యార్థి సలహాదారు బండి ప్రసాద్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి సుధాకర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రామకృష్ణ, సి రేపటి, ఎండి ముజిబుద్దీన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కే రమేష్, పి వసంతలక్ష్మి, జి శ్రావణ్ కుమార్ మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను కాపాడటం ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడింది.












