మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, రైతుల సమస్యలపై ఉపన్యాసం ఇచ్చిన వెటర్నరీ విద్యార్థిని చి. గడియారం ఐశ్వర్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు 10,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందజేశారు.
హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, గడియారం బాలాజీ ఉదయ గార్ల కుమార్తె, ప్రస్తుతం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 4వ సంవత్సరం చదువుతున్న చి. గడియారం ఐశ్వర్య చేసిన ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుత వ్యవసాయ విధానంలో రైతులు విత్తన దశ నుంచి మార్కెటింగ్ వరకు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలి, వారిని ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలపై చి. ఐశ్వర్య చేసిన ఉపన్యాసానికి గాను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమెను అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు 10,000 రూపాయల ప్రైజ్ మనీని కూడా అందజేశారు. ఈ సన్మానంపై టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీమతి గడియారం పల్లవి శ్రీహరి స్పందిస్తూ, తమ కుమార్తె ఐశ్వర్యను మంత్రిగారు సన్మానించడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. భవిష్యత్తులో ఐశ్వర్య ఉన్నతంగా చదివి, రైతుల సమస్యల పరిష్కారంలో సేవలు అందించి, తమ వంశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.












