మంచేరియల్, 8 September
మంచిర్యాల పట్టణానికి చెందిన రంగు మౌనిక, న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా సాధించి మంచిర్యాల పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం సందర్భంగా ఆమె ఈ పట్టాను అందుకున్నారు.
మంచిర్యాల యువతికి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా మంచిర్యాల పట్టణానికి చెందిన రంగు మౌనిక, శ్రీ రంగు సత్యనారాయణ – శ్రీమతి జ్యోతి దంపతుల కుమార్తె, న్యాయశాస్త్రంలో విశిష్ట విద్యా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ పీహెచ్డీ పట్టా సాధించి మంచిర్యాల పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. 08-09-2026న ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం సందర్భంగా ఆమె న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ఆమె విద్యాభ్యాసంలో భాగంగా 🎓 LL.B. – ఉస్మానియా లా కళాశాల 🎓 LL.M. – నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 🎓 Ph.D. – Biomedical Waste Management in Hyderabad City అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ విశిష్ట విద్యా విజయాన్ని సాధించిన డా. రంగు మౌనికకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, న్యాయరంగంలో విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచిర్యాల గర్వించదగిన విద్యా రత్నం – డా. రంగు మౌనికకు అభినందనలు!












