Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 15
జైపూర్ మండలం ఇందారం గ్రామ ZPSS ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ ఆకస్మికంగా సందర్శించి, తరగతి గదులు, వంటగది, వాష్రూమ్ల పరిశుభ్రతను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
జైపూర్ మండలం ఇందారం గ్రామ ZPSS ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్ మరియు ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, వాష్రూమ్ల పరిశుభ్రతను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం ప్రతిరోజు పిల్లలకు అన్ని రకాల వంటలు నాణ్యతగా అందించాలని వంట సిబ్బందికి సూచించారు. మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పిల్లల చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని తెలియజేశారు.












