ప్రజా సమస్యలను వెలికితీసి, వాటిని పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే రిపోర్టర్ల అసలైన వృత్తి అని రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుస్స శివప్రసాద్ అన్నారు. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
క్లబ్ నియమ నిబంధనలను సభ్యులందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పలు పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులు రవీంద్రఖని ప్రెస్ క్లబ్లో చేరగా, వారిని అధ్యక్షుడు శివప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు.
నూతన కార్యవర్గ నియామకం
అనంతరం కార్యవర్గాన్ని విస్తరిస్తూ నూతన బాధ్యులను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా మామిడాల రవి, రామిడి సాయి సృజన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దండు సదానందం, జాయింట్ సెక్రటరీలుగా కందుల ప్రవీణ్, అప్పని కిరణ్ ఎన్నికయ్యారు. నాయకులందరూ సమన్వయంతో పనిచేసి క్లబ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోలు దాసరి శ్రీనివాస్, కోశాధికారి పరికిపండ్ల రాజు, సభ్యులు తూముల భవిష్యత్, నరేడ్ల వెంకన్న, కరెడ్ల రఘు, బొద్దుల భూమయ్య, కోల శ్రీనివాస్, బత్తుల సతీష్, నందు, సాయిని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











