మంచేరియల్, జూలై 30, 2026
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఎన్. మురళీకృష్ణ పలు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, సెల్లార్లు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. శిథిల ఇళ్లలో ఉండేవారి కోసం పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఎన్. మురళీకృష్ణ సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, సెల్లార్లు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
సెల్లార్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లు, వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను వీలైనంత త్వరగా గ్రౌండ్ ఫ్లోర్ లేదా ఫస్ట్ ఫ్లోర్‌కు మార్చుకోవాలని సూచించారు. అలాగే సెల్లార్లలో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్న భవనాల యజమానులు ముందస్తు జాగ్రత్తగా వాటర్ మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లాలని, అవసరమైతే క్యాతన్‌పల్లి మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. అటువంటి కుటుంబాల కోసం రామకృష్ణాపూర్‌లోని ఆర్ కే సీ ఓ ఏ క్లబ్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని హెచ్చరించారు.
పట్టణంలోని మాంసం, చికెన్, చేపల విక్రయ దుకాణాల యజమానులు తమ దుకాణాల్లో పరిశుభ్రత పాటించాలని, విక్రయించే ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా దోమతెరలు లేదా రక్షణ కవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రోజు దుకాణాలను ఫినాయిల్ లేదా డెటాల్‌తో శుభ్రపరచాలని ఆదేశించారు.
ప్రజల సౌకర్యార్థం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్. సునీల్ కుమార్ (9032189923), ఇన్చార్జి శానిటరీ జవాన్ ఇ. శ్రీనివాస్ (8096672215), ఇన్చార్జి శానిటరీ జవాన్ ఏ. శ్యామ్ (7386561327)లను సంప్రదించాలని సూచించారు.
మున్సిపాలిటీ జారీ చేసిన సూచనలను పాటించని వారిపై మున్సిపల్ చట్టం–2019 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.












